లింగ నిష్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా? | Telangana - the existence of the population | Sakshi
Sakshi News home page

లింగ నిష్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా?

Published Fri, Apr 3 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

లింగ నిష్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా?

లింగ నిష్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా?

తెలంగాణ - ఉనికి, జనాభా
 
తెలంగాణ 2014 జూన్ 2న భారత దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. అదే రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగువారు రాష్ట్ర సాధనకు కృషి చేసిన దానికంటే ఎక్కువగా తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజన కోసం ఉద్యమించారు. 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ (ప్రస్తుత ఆంధ్రా భవన్) లో పెద్దమనుషుల ఒప్పందం (జెంటిల్‌మెన్ అగ్రిమెంట్) జరిగింది. ఈ ఒప్పందంపై ఆంధ్ర ప్రాంతం నుంచి నలుగురు, తెలంగాణ నుంచి నలుగురు నాయకులు సంతకాలు చేయడం ద్వారా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసి కొత్త రాష్ట్రంగా అవతరించాయి. నూతన రాష్ట్రానికి ‘ఆంధ్రా-తెలంగాణ’ అనే పేరును పరిశీలించినా, భవిష్యత్‌లో వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయని భావించి ఆంధ్రప్రదేశ్‌గా నిర్ణయించారు.

పెద్దమనుషుల ఒప్పందంలో తీసుకున్న నిర్ణయాలు, తెలంగాణ ప్రాంతానికి కల్పించిన రక్షణలు అమలు కాకపోవడం వల్ల తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా ‘నీళ్లు, నిధులు, ఉద్యోగాలు’ అనే మూడు ముఖ్యాంశాలతో ప్రారంభమైంది. క్రమంగా అన్ని వర్గాల మద్దతు పొంది, రాష్ట్రం ఏర్పాటు చేసేంత వరకు ఉధృతంగా కొనసాగింది.  భౌగోళికంగా తెలంగాణ భారత ద్వీపకల్పంలో 15ని55ఐ నుంచి 19ని55ఐ ఉత్తర అక్షాంశాలు, 77ని22.35ఐ నుంచి 81ని2.23ఐ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరాన గోదావరి, ప్రాణహిత; దక్షిణాన కృష్ణా, తుంగభద్ర నదులు; తూర్పున తీరాంధ్ర ప్రాంతాన్ని వేరు చేస్తూ నల్గొండ, ఖమ్మం జిల్లాలోని పర్వతాలు; ఉత్తర-పశ్చిమ దిశల్లో మహారాష్ట్ర, కర్ణాటకను వేరు చేస్తూ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలోని పర్వత పంక్తులు సరిహద్దులుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సముద్ర మట్టానికి సగటున 480-600 మీటర్ల ఎత్తులో ఉంది. హైదరాబాద్ సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉంది. భీమా, గోదావరి నదుల మధ్య(హైదరాబాద్- వరంగల్-ఖమ్మం మధ్య ప్రాంతం) ఎత్తు 730 మీటర్ల వరకు ఉంది. కృష్ణా-తుంగభద్ర నదీలోయ ప్రాంతంలో ఎత్తు 300-450 మీటర్ల వరకు ఉంది.
 
ఉనికి-భౌగోళిక విస్తీర్ణం

భౌగోళిక పరంగా తెలంగాణ రాష్ట్రం 1,14,840 చ.కి.మీ పరిధితో దేశంలో 12వ స్థానంలో ఉంది. దేశ విస్తీర్ణంలో 2.79 శాతం వాటాను కలిగి ఉంది. విస్తీర్ణం దృష్ట్యా రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లాలు వరుసగా.. 1) మహబూబ్ నగర్, 2) ఆదిలాబాద్, 3) ఖమ్మం. అతిచిన్న జిల్లాలు వరుసగా 1) హైదరాబాద్, 2) రంగారెడ్డి.
 
పట్టణాలు/నగరాలు:

రాష్ట్రంలోని 10 జిల్లాల్లో మొత్తం 68 నగరాలు/ పట్టణాలు ఉన్నాయి. ఇందులో కార్పొరేషన్లు-6, మున్సిపాలిటీలు-37, నగర పంచాయతీలు-25 ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం.. రాష్ట్రంలోని 6 కార్పొరేషన్లు.
 
అత్యధిక పట్టణ జనాభా కలిగిన నగరాలు:
     1) గ్రేటర్ హైదరాబాద్
     2) వరంగల్     3) నిజామాబాద్
     4) కరీంనగర్     5) రామగుండం

అత్యధిక పట్టణ జనాభా శాతం ఉన్న జిల్లాలు:
     1) హైదరాబాద్ (100 శాతం)
     2) రంగారెడ్డి (70.2 శాతం)

అతి తక్కువ పట్టణ జనాభా శాతం ఉన్న జిల్లాలు:
     1) మహబూబ్‌నగర్ (15 శాతం)
     2) నల్గొండ (19 శాతం)
     3) నిజామాబాద్ (23.1 శాతం)
     4) ఖమ్మం (23.4 శాతం)
 
 తెలంగాణ రాష్ట్ర గ్రామీణ, పట్టణ జనాభా వరుసగా 61.3 శాతం, 38.7 శాతంగా ఉంది. రాష్ట్రంలో గ్రామీణ జనాభా 2,15,85,313గా, పట్టణ జనాభా 1,36,08,665గా నమోదైంది.
 
గ్రామ పంచాయతీలు:
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 8,691 గ్రామ పంచాయతీలున్నాయి.
 
జనాభాఙ్ట్చఛగ్రామ పంచాయతీలు
200    జనాభా కలిగినవి    346
500    లోపు జనాభా ఉన్నవి    870
1000    లోపు జనాభా ఉన్నవి    1,733
2000    లోపు జనాభా ఉన్నవి    3,029
5000    లోపు జనాభా ఉన్నవి    3,104
10,000    లోపు జనాభా ఉన్నవి    630
10,000    కంటే ఎక్కువ జనాభా ఉన్నవి    122
 
జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలు:

1) మహబూబ్‌నగర్
     2) నల్గొండ     3) కరీంనగర్
     4) వరంగల్     5) మెదక్
 
జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు:
     1) రంగారెడ్డి    2) నిజామాబాద్

జనాభా శాతం ఎక్కువగా ఉన్న జిల్లాలు:
     1) మహబూబ్ నగర్
     2) నల్గొండ     3) నిజామాబాద్
     4) ఖమ్మం     5) మెదక్

జనాభా శాతం తక్కువగా ఉన్న జిల్లాలు:
     1) రంగారెడ్డి    2) వరంగల్
 
 తెలంగాణ రాష్ట్ర జనాభా

 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 3,51,93,978. జనాభా రీత్యా తెలంగాణ రాష్ట్రం దేశంలో 12వ స్థానంలో ఉంది. జనాభా, విస్తీర్ణం రెండింటి దృష్ట్యా ఇది 12వ స్థానంలో ఉంది.

అత్యధిక జనాభా ఉన్న జిల్లాలు:
     1) రంగారెడ్డి     2) మహబూబ్‌నగర్
     3) హైదరాబాద్     4) కరీంనగర్
     5) వరంగల్

 అతి తక్కువ జనాభా కలిగిన జిల్లాలు:
     1) నిజామాబాద్    2) ఆదిలాబాద్
     3) ఖమ్మం

పురుషుల జనాభా అధికంగా ఉన్న జిల్లాలు:
     1) రంగారెడ్డి     2) మహబూబ్‌నగర్
     3) హైదరాబాద్     4) కరీంనగర్
     5) నల్గొండ

 {స్తీల జనాభా అధికంగా ఉన్న జిల్లాలు:
     1) రంగారెడ్డి
     2) మహబూబ్‌నగర్
     3) హైదరాబాద్

 {స్తీ, పురుష నిష్పత్తి/లింగ నిష్పత్తి:

     1000 మంది పురుషులకు ఉండే స్త్రీల సం ఖ్యను లింగ నిష్పత్తి అంటారు. తెలంగాణ రాష్ట్రంలో 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలు ఉన్నారు. ఈ సగటు భారతదేశంలో 943గా ఉంది. అంటే దేశ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువగా ఉంది.

రాష్ట్రంలో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లాలు:
     1) నిజామాబాద్ (1040)    2) ఖమ్మం (1011)
     3) కరీంనగర్ (1008)
     4) ఆదిలాబాద్ (1001)
     ఈ నాలుగు జిల్లాల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు.

అతి తక్కువ లింగ నిష్పత్తి ఉన్న జిల్లాలు:
     1) హైదరాబాద్ (954)
     2) రంగారెడ్డి (961)

     3) మహబూబ్‌నగర్ (977)
     4) నల్గొండ (983)
     5) మెదక్ (992)
     6) వరంగల్ (997)
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు, స్త్రీల నిష్పత్తి: 1000 : 999. దేశంలో ఇది 1000 : 949 గా ఉంది.
రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో పురుషులు, స్త్రీల నిష్పత్తి: 1000:970. దేశంలో ఇది 1000 : 929గా ఉంది.
తెలంగాణలో బాలురు, బాలికల నిష్పత్తి:
 1000 : 933. దేశంలో ఇది 1000 : 919.

2001లో తెలంగాణ ప్రాంత పురుషులు, స్త్రీల నిష్పత్తి: 1000 : 971 కాగా, ఇది 2011 నాటికి 1000 : 988కి పెరిగింది.
బాలబాలికల లింగ నిష్పత్తి (0-6 ఏళ్లు):రాష్ట్రం లో 0 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల సంఖ్య 39,20,418. ఇందులో బాలురు 20,28,497, బాలికలు 18,91,921 ఉన్నారు.
రాష్ట్రంలోని మొత్తం బాలబాలికల (0-6 ఏళ్లు) జనాభాలో గ్రామీణ ప్రాంతాల్లో 23,90,626, పట్టణ ప్రాంతాల్లో 15,29,792మంది ఉన్నారు.
రాష్ట్రంలో 0-6 సంవత్సరాల వయసున్న జనాభాలో బాలురు, బాలికల నిష్పత్తి 1000 : 933గా ఉంది. ఇది దేశంలో 1000 : 919గా ఉంది.
0-6 సంవత్సరాల వయసున్న బాలబాలికల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లాలు: ఖమ్మం (958), మెదక్ (952), నిజామాబాద్ (948), కరీంనగర్(935), ఆదిలాబాద్ (934).
0-6 సంవత్సరాల వయసున్న బాలబాలికల్లో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లాలు: హైదరాబాద్ (914), వరంగల్ (923).
 
నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రా్ర్టానికి విశిష్టమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర  ఉంది. గతంలో ‘దక్షిణాపథం’గా గుర్తింపు
 పొందిన దక్కన్ పీఠభూమిలో ఇది అంతర్భాగంగా  ఉంది. విభిన్న రకాల నేలలు, ఖనిజ వనరులు,  అటవీ సంపద, నదులు మొదలైనవాటితో  తెలంగాణ రాష్ట్రం అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా విలసిల్లుతోంది.
 
 

Advertisement

పోల్

Advertisement