
హిందుపురం నుంచే బాలకృష్ణ పోటీ
హైదరాబాద్ : హీరో బాలకృష్ణకు ప్లేస్ కన్ఫార్మ్ అయ్యింది. అనంతపురం జిల్లా హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ బరిలోకి దిగనున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం బాలయ్య సీటును ఖరారు చేశారు. ఈనెల 16వ తేదీన బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా బాలకృష్ణ ఈరోజు ఉదయం చంద్రబాబుతో సమావేశమై టిక్కెట్పై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో హిందూపురం నియోకవర్గం టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని కూడా పాల్గొన్నారు.