‘బాబు’ను చూస్తే ఆ ఘటనే గుర్తుకొస్తుంది..
ఆ రోజు పోలీసులు వ్యవహరించిన తీరు తలచుకుంటే ఒళ్లు మండిపోతుంది. వూ వాళ్ళనే కాల్చేసి, వూ ఎదురుగానే ఆనాటి వుంత్రులకు అండగా రావడం కలచివేసింది. వెక్కిరించినట్టు అన్పించింది. ప్రభుత్వం తీరుపై వూకు కసిపెరిగింది. చంద్రబాబును చూసినప్పుడల్లా ఆ ఘటనే గుర్తుకొస్తుంది. ఆయన లేకపోవడంతో నలుగురు పిల్లల భారం నా మీద పడింది. ప్రభుత్వం నుండి అందిన సాయం అరకొరగానే వుంది. ఇద్దరు ఆడ పిల్లల పెళ్ళిళ్లు, వారికి కావాల్సిన అవసరాలు తీర్చేందుకు, మగ పిల్లలు చదువులతో ఆర్థికంగా బాగా చితికి పోయాం. వైఎస్ ఉన్నప్పుడు మమ్ములను కొంత వరకు ఆదుకున్నాడు.
- రాజు తిరుపతమ్మ, రాఘవరెడ్డి భార్య, చినగంజాం
నుదిటి బొట్టును తుడిచేశారు
నీటి తీరువా.. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగినందుకు నా పెనిమిటిని తుపాకితో కాల్చి చంపారు. నా నుదిటి బొట్టును చెరిపేశారు. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. ఆయన పోయాక నా కుమారుడు శ్రీనివాస్‌కు ఏలూరు జిల్లా పరిషత్‌లో ఉద్యోగం ఇచ్చారు. మూడున్న రేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత శ్రీనివాస్ అనారోగ్యంతో మరణించారు. దీంతో మా ఇంటికి రెండోదిక్కు కూడా దూరమైంది. నా భర్త ప్రాణాల్ని తీసి 18 ఏళ్లు కావస్తోంది. ఇప్పటికీ విషాదం నుంచి దుఃఖం నుంచి కోలుకోలేకపోతున్నాం.
- ఆలపాటి భద్రమ్మ, రామచంద్రరావు భార్య, కాల్ధరి
కాల్ధరిలో పిట్టల్లా కాల్చేశారు..
నీటి తీరువా, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని అడిగిన రైతులపై చంద్రబాబు ప్రభుత్వం బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు రైతులు బలయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కాల్ధరి రైల్వే స్టేషన్‌లో 1996 సెప్టెంబర్ 6న ఈ ఘటన చోటుచేసుకుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈప్రాంతానికి చెందిన రైతులు ఆ రోజు రైల్‌రోకో చేపట్టి గూడ్స్ రైలును కొంతసేపు నిలిపేశారు. దీంతో రైతులకు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే పోలీసులు నేరుగా తుపాకులను గురిపెట్టి బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో కాల్ధరి గ్రామానికి చెందిన రైతు ఆలపాటి రామచంద్రరావు, వేలివెన్ను గ్రామానికి చెందిన రైతు గన్నమని కష్ణారావుఅక్కడికక్కడే పిట్టల్లా రాలిపోయూరు.
బషీర్‌బాగ్... ఓ దమనకాండ
అది ఆగస్టు 28, 2000.విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ అప్పటి ప్రతిపక్షపార్టీలు నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో 2000 సంవత్సరంలో జరిగిన పోలీసు కాల్పుల్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన బాలస్వామి(22), ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన సత్తెనపల్లి రామకృష్ణలు మృతి చెందారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
చినగంజాం.. ఓ నెత్తుటి జ్ఞాపకం
అది ఫిబ్రవరి 11, 2000 సంవత్సరం. ప్రకాశం జిల్లా చినగంజాం. స్నోవైట్ సాల్ట్‌ను ఆనాటి టీడీపీ సర్కార్ వెనకేసుకు రావడాన్ని రైతులు నిరసించారు. ఉప్పు తయూరీ వల్ల పంట భూవుులు నిరుపయోగవువుతాయుని ఆందోళన వ్యక్తం చేశారు. కడుపు వుండి రోడ్డెక్కిన రైతులపై పోలీసులు పాశవికంగా కాల్పులు జరిపారు. దీంతో రాజుబంగారుపాలెంనకు చెందిన కుక్కల పుల్లా రెడ్డి, మూలగాని వారి పాలెంనకు చెందిన రాజు రాఘవ రెడ్డి బలయ్యూరు. వైఎస్ హయాం వచ్చాక మృతుల కుటుంబాలకు నగదు, భూమి, ఉద్యోగాన్ని ఇప్పించారు.
విత్తనాలడిగితే కాల్చేశారు
అది జూలై 26, 2003వ సంవత్సరం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలకేంద్రం. మొక్కజొన్న విత్తనాలు పంపిణీ చేస్తున్నారని రైతులు పాసు పుస్తకాలతో వ్యవసాయ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున క్యూలో నిల్చున్నారు. అయితే విత్తనాలు సరిపడా లేకపోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కౌకుంట్లకు చెందిన విఠల్‌జీ అనే యువరైతు గాయపడి ఆ తర్వాత మృతి చెందాడు. అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేవెళ్లకు వచ్చి గాయపడిన విఠల్‌జీని పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
రక్తచరిత్ర.. రైతుల నెత్తురు కళ్లజూసిన చంద్రబాబు
Published Tue, Apr 15 2014 2:10 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM
Advertisement
Advertisement