'ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యా' | Director N.Shankar to contest as Independent in Miryalaguda | Sakshi
Sakshi News home page

'ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యా'

Published Tue, Apr 8 2014 1:30 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యా' - Sakshi

'ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యా'

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. సామాజిక చిత్రాల దర్శకుడు ఎన్.శంకర్‌కు కాంగ్రెస్ మొండిచేయి చూపడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి నిర్ణయించుకున్నారు. రాహుల్ టీమ్ సర్వేల మేరకు ఈ ప్రాంత ప్రజల్లో ఆదరణ ఉన్న శంకర్‌కు టికెటిస్తే, తమకు లాభిస్తుందని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ ఆ మేరకు   నిర్ణయం తీసుకుంది. మిర్యాలగూడ నుంచి బరిలోకి దింపాలని భావించింది. అయితే జిల్లా కాంగ్రెస్ నేతలు దీనికి అంగీకరించక పోవడంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాలేదు.

దీంతో ఆయా బీసీ సంఘాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలు, జేఏసీల ఒత్తిడి మేరకు ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగాల్సిందేనని శంకర్ నిర్ణయం తీసుకునారు. మిర్యాలగూడ నుంచి సీపీఎం నుంచి  జూలకంటి రంగారెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి అమరేందర్‌రెడ్డి అభ్యర్థులుగా ఉన్నారు. సోమవారం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్.భాస్కర్‌రావు, టీడీపీనుంచి బంటు వెంకటేశ్వర్లు పేర్లు ప్రకటించారు. వీరికి తోడు, శంకర్ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో హాట్ సీట్లలో ఒకటిగా మిర్యాలగూడ నిలవనుంది. ఆయన తరఫున ప్రచారానికి  కొన్నిజేఏసీలు సిద్ధమయ్యాయని చెబుతున్నారు.

 ‘తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసింది కుటుంబ వారసత్వ రాజకీయాలు కొనసాగడానికి కాదు. కొందరు నాయకులు కుల దురహంకారంతో బీసీలకు టికెట్లు ఇవ్వడానికి సుముఖంగా లేరు. తమ కుటుంబ సభ్యులు, లేదంటే వారి తొత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నాణ్యమైన రాజకీయం అంటే ఎలా ఉంటుందో చూపించేందుకు, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల జెండాను ఎత్తి పట్టేందుకు మిర్యాలగూడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యా..’ అని డైరెక్ట్ర్ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement