23న టీడీపీలో చేరుతున్నా: జేసీ | jc diwakar reddy to join tdp on 23rd | Sakshi
Sakshi News home page

23న టీడీపీలో చేరుతున్నా: జేసీ

Published Wed, Mar 19 2014 7:38 PM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

23న టీడీపీలో చేరుతున్నా: జేసీ - Sakshi

23న టీడీపీలో చేరుతున్నా: జేసీ

మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అందుకు ముహూర్తంగా ఈనెల 23వ తేదీని ఖరారు చేశారు. రాష్ట్ర విభజన, దానికి ముందు, తర్వాతి పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పటినుంచో మండిపడుతున్న ఆయన.. ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇరు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని, ఆ పార్టీకి పుట్టగతులు ఉండబోవని కూడా జేసీ గతంలో తీవ్రంగా విమర్శించారు.

ఆయన టీడీపీలో చేరుతారన్న విషయం ఎప్పటినుంచో ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. ఈమధ్య కాలంలో కాంగ్రెస్ నాయకుల కంటే టీడీపీ నేతలతోనే జేసీ ఎక్కువగా తిరుగుతున్నారని కూడా గుసగుసలు వినిపించాయి. ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ, తాను మార్చి 23వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement