
మన్మోహన్ బలహీన ప్రధాని
మోడీపై ప్రశంసలు కురిపించిన అద్వానీ
అహ్మద్‌నగర్: బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ సోమవారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ లక్ష్యంగా విమర్శలు సంధించారు. తనకంటే బలహీనమైన ప్రధాని మరొకరు లేరని మన్మోహన్ నిరూపించుకున్నారని అన్నారు. షేవ్‌గావ్‌లో బహిరంగ సభలో మాట్లాడిన అద్వానీ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేరుు ప్రారంభించిన అభివృద్ధి ప్రక్రియను మోడీ పునఃప్రారంభిస్తారని అన్నారు. నర్మద ప్రాజెక్టు, పారిశ్రామికీకరణ, ప్రతి ఒక్క రైతుకూ నీటిని అందించడం, విద్య, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గుజరాత్ రూపురేఖల్నే మోడీ మార్చివేశారని చెప్పారు.