కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడక్కర్లేదు
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, పూర్తిగా అవాస్తవాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కిరణ్ చెప్పారు.
మరోవైపు కేంద్ర మంత్రి చిరంజీవి వ్యాఖ్యల మీద కూడా కిరణ్ స్పందించారు. చిరంజీవి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లో డైలాగులు చెప్పడం కాదని ఆయన వ్యాఖ్యానించారు.