వాజ్‌పేయితో సంప్రదింపులు బయటపెట్టొచ్చా? | Prime Minister's Office (sources) wait for Narendra Modi's approval | Sakshi
Sakshi News home page

వాజ్‌పేయితో సంప్రదింపులు బయటపెట్టొచ్చా?

Published Mon, Apr 14 2014 3:43 AM | Last Updated on Thu, Aug 16 2018 4:01 PM

Prime Minister's Office (sources) wait for Narendra Modi's approval

 గుజరాత్ ప్రభుత్వం, మోడీల ఆమోదం కోరిన పీఎంఓ
 
న్యూఢిల్లీ: గోధ్రా అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని వాజ్‌పేయితో జరిపిన సంప్రదింపులను బహిర్గత పరచడంపై గుజరాత్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆమోదాన్ని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) కోరింది. అయితే గతంలో ఆ సమాచారాన్ని బహిర్గతపరచడానికి పీఎంఓ కేంద్ర ప్రజా సమాచార అధికారి (సీపీఐఓ) ఎస్‌ఈ రిజ్వీ నిరాకరించారు. ఆర్టీఐ యాక్ట్ 8 (1)(హెచ్) ప్రకారం ఏవిధమైన కారణాలు చూపకుండానే ఆయన నిర్ణయం తీసుకున్నారు.
 
దీనిపై ఆర్టీఐ ద్వారా సమాచారం కోరిన దరఖాస్తుదారుడు అభ్యతరం చెప్పారు. ఆ సమాచారం ఇవ్వకపోవడానికి సరైన కారణాలు చూపించలేదని అతడు ఆరోపించాడు. పదకొండేళ్ల క్రితం జరిగిన ఆ సంప్రదింపులను బహిర్గతం చేయడం వల్ల విచారణపై ప్రభావం పడదని, అది నిందితులకు ఆందోళన కలిగించే అంశం కూడా కాదని ఆయన చెప్పారు.
 
దీనిని సమర్థించిన అప్పీలేట్ అథారిటీ ఆ కేసుకు సంబంధించిన అదనపు సమాచారం ఇవ్వాల్సిందిగా సీపీఐఓకు సూచించిం ది. తాజా సమాచారాన్ని పదిహేను రోజుల్లోగా దరఖాస్తుదారునకు అందించాలని అప్పీలేట్ అథారిటీ, పీఎంఓ డెరైక్టర్ కృష్ణన్ కుమార్ నిర్ణయించారు. దీంతో ఆర్టీఐ యాక్ట్ 11 (1) ప్రకారం థర్డ్‌పార్టీ అయి న గుజరాత్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మోడీలకు అప్పీలేట్ నిర్ణయాన్ని తెలిపామని రిజ్వీ చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement