పవన్కు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ సలహాలు
సంచలనాల దర్శకుడు, ట్విట్టర్లో తన అభిప్రాయాలను కుండ బద్దలుకొట్టినట్లు చెప్పే రాంగోపాల్ వర్మ.. తాజాగా గత రెండు రోజుల నుంచి పవన్ కల్యాణ్కు పలు రకాల ఉద్బోధలు చేస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగాలు, ఆయన విడుదల చేసిన పుస్తకం, ఇచ్చిన ఇంటర్వ్యూలు.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వర్మ ఈ వ్యాఖ్యానాలు చేసినట్లు తెలుస్తోంది. పవనిజం అనేది స్వచ్ఛంగా ఉండాలి తప్ప సగం సగం అర్థం చేసుకున్న కొంతమంది వ్యక్తులు చెప్పే విషయాలతో అది కల్తీ కాకూడదని వర్మ సలహా ఇచ్చారు.
Hey Pawan, Bruce Lee said "knowledge shud be used like steps of a ladder ..u shud use thm to climb but u shud not carry them on ur shoulder"
— Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2014
ముందుతరం సిద్ధాంతాలను ఇప్పటికే సమాజాలు పూర్తిగా అర్థం చేసుకున్నాయని, అందువల్ల వాటిని ఇప్పుడు మళ్లీ చెప్పాల్సిన అసవరం లేదని, స్వచ్ఛమైన పవనిజం అంటే ఏంటో చెబితే సరిపోతుందని అన్నారు. ఇక బ్రూస్లీ ఏమన్నారో కూడా వర్మ తన ట్వీట్ ద్వారా మరోసారి పవన్ కల్యాణ్కు గుర్తు చేశారు. ''విజ్ఞానాన్ని నిచ్చెన మెట్లలా ఉపయోగించుకోవాలి. వాటిని పైకి ఎక్కడానికే మనం ఉపయోగించుకోవాలి తప్ప.. ఆ నిచ్చెనను భుజం మీద మోసుకుని వెళ్లడానికి కాదు'' అని బ్రూస్లీ చెప్పినట్లు వర్మ తెలిపారు.
Ur friend shud understand tht yesteryears philosophies hv already bn absorbed into evolution of societies..what's needed is pure Pawanism
— Ram Gopal Varma (@RGVzoomin) April 2, 2014