పొత్తు సెగ!
Published Mon, Apr 7 2014 1:54 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీ అధిష్టానంపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇష్టమొచ్చినట్టు సీట్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టాన ం దారికొస్తే సరే లేదంటే కఠిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా గెలవలేక బీజేపీతో పొత్తుకు వెంపర్లాడిన చంద్రబాబు...గజపతినగరం శాసనసభ, అరకు పార్లమెంట్ స్థానాలను బీజేపీకి కేటాయించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లూ పడిన కష్టం, చేసి న ఖర్చు బూడిదలో పోసిన పన్నీరేనా అని ప్రశ్నిస్తున్నారు. తమను కాదని నిర్ణయం తీసుకుంటే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
కొండపల్లికి షాక్
ఎలాగూ పోయిన సీటేనన్న అభిప్రాయంతో గజపతినగరం శాసన సభ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఇదే విషయాన్ని గజపతినగరం టీడీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నేరుగా ఫోన్ చేసి తెలియజేశారు. బీజేపీతో కలిసి పని చేయాలని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేలా సహకరించాలని కోరారు. దీంతో పార్టీ నేతలు కంగుతిన్నారు. అకస్మాత్తుగా అధినేత ఫోన్ చేసి ప్రతికూల నిర్ణయాన్ని వెల్లడించడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
అధినేత నిర్ణయంపై అశోక్ అసంతృప్తి
గజపతినగరం స్థానాన్ని బీజేపీకి కేటాయించారన్న సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడి టిక్కెట్ ఆశిస్తున్న కొండపల్లి అప్పలనాయుడు సుమారు 50 మంది అనచరులతో కలిసి ఆదివారం అశోక్ బంగ్లాకు చేరుకున్నారు. వేరే సమావేశంలో ఉన్న అశోక్ గజపతిరాజును మధ్యలోనే పిలిచి, తన గోడు వెళ్లబోసుకున్నారు. ఐదేళ్లుగా వ్యయప్రయాసలకులోనై నమ్ముకుని పనిచేస్తే చివరికీ ఇలా చేయడమేంటని నిరసన వ్యక్తం చేశారు. ప్రచార సాధనాల్లో రావడమే తప్ప పార్టీ నుంచి ఎటువంటి సమాచారం లేదని, గజపతినగరం బీజేపీకిస్తే ఇబ్బందేనని అశోక్ బదులిచ్చినట్టు తెలిసింది. అనంతరం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి అశోక్ గజపతిరాజు ఫోన్ చేసి గట్టిగా అడిగినట్టు తెలిసింది. తాను ఎంపీగా పోటీ చేయాలంటే గజపతినగరం టిక్కెట్‌ను బీజేపీకి ఇవ్వొద్దని, ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఎంపీగా కొండపల్లి అప్పలనాయుడ్ని నిలబెట్టి, విజయనగరం ఎమ్మెల్యేగా తనను బరిలో ఉంచాలని కోరినట్టు తెలిసింది. లేదంటే అప్పలనాయుడికి అన్యాయం చేసిన వారమవుతాయని గట్టి చెప్పినట్టు పార్టీ వర్గాల ద్వారా విన్పించింది. చెప్పాలంటే కాస్త అసంతృప్తితో అలకపూనే విధంగా మాట్లాడినట్టు సమాచారం.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఒత్తిడి
అప్పలనాయుడు అను చరులైతే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అప్పలనాయుడుపై ఒత్తిడి చేస్తున్నారు. ఇక అప్పలనాయుడికి పార్టీలో ప్రత్యర్థి వర్గంగా ఉన్న పడాల అరుణ, కరణం శివరామకృష్ణ మాత్రమే సంతోషంతో ఉన్నట్టు తెలిసింది. తమకు టిక్కెట్ రాదని ఇంతకుము ందే తేలిపోవడంతో ఎవరికిస్తే మాకేంటి అన్నధోరణితో ఉన్నారు. ముఖ్యంగా అప్పలనాయుడికిస్తే నియోజకవర్గంలో తమ పట్టు పోతుందని, ప్రాబల్యాన్ని కోల్పోవాల్సి వస్తుందని, బీజేపీతో అటువంటి ఇబ్బందులేవీ ఉండవని, భవిష్యత్‌లో మళ్లీ పుంజుకోవడానికి అవకాశంఉంటుందన్న అభిప్రాయంతోవారుఉన్నట్టు తెలిసింది.
బుజ్జగించే ప్రయత్నం
అప్పలనాయుడు ఆవేదన, ఆయన అనుచరుల ఆగ్రహాన్ని పసిగట్టిన జిల్లా నాయకత్వం బుజ్జగించే పనిలో పడినట్టు తెలిసింది. గజపతి నగరం కాకపోతే చీపురుపల్లి టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని జిల్లా నాయకులు సూచన ప్రాయంగా నాయుడికి చెబుతున్నారు. ఎలాగూ చీపురుపల్లిలో ఐదాగురు నాయకులు టిక్కెట్ కోసం కీచులాడుకుంటున్నారని, గతంలో ఇన్‌ఛార్జిగా పని చేసిన అనుభవం దృష్ట్యా ఆ టిక్కెట్‌ను అప్పల నాయుడికి ఇచ్చే ఆలోచన ఉందన్న అభిప్రాయాన్ని పరోక్షంగా తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా, అప్పలనాయుడి పేరును చీపురుపల్లికి పరిశీలిస్తున్నారన్న వాదనలు తెరపైకి రావడంతో ఆ నియోజకవర్గ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే తమ తడాఖా చూపిస్తామని ముందస్తు హెచ్చరికలు
డీవీజీకి రెండో ‘సారీ’...
ఇక మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు పరిస్థితి జాలిగొలిపే విధంగా ఉంది. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న డీవీజీకి పొత్తుల కారణంగా మరో సారి మొండి చేయి ఎదురవుతోంది. తాజాగా కుదుర్చుకున్న పొత్తుల్లో అరకు పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో ఆయన తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తొలి నుంచి గుమ్మడి సంధ్యారాణి, శోభా స్వాతి రాణి రూపంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న డీవీజీకి ప్రాదేశిక ఎన్నికల పుణ్యమా అని లైన్ క్లియర్ అయిందనుకుంటే ఇప్పుడు పొత్తు పొడవడంతో కోలుకోలేని షాక్ తిన్నారు. గత ఎన్నికల్లో కూడా పొత్తుల్లో భాగంగానే అరకు పార్లమెంట్‌ను సీపీఎంకు కేటాయించడంతో డీవీజీ పోటీకి దూరమయ్యారు. ఈ సారి పొత్తులో బీజేపీకి కేటాయించడంతో మరోసారి పోటీకి దూరం కావల్సి వస్తోంది.
దీంతో డీవీజీ శంకరరావు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. క్యాడర్ ఉన్న తనను కాదని బీజేపీకి ఇవ్వడం వల్ల సాధించిందేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడిన తరువాత కఠిన నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నారు. ఇన్నాళ్లూ విధేయునిగా ఉన్న తనకు న్యాయం జరగనప్పుడు ఇంకా వేచి ఉండడం సరికాదని అభిప్రాయంతో ఉన్నారు. పాడేరు, అరకు, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల నుంచి ఆయనకు విపరీతమైన ఫోన్‌లొస్తున్నాయి. పార్టీ అనాయయం చేసిందని, తగినబుద్ధిచెప్పాలని డీవీజీపైఅనుచరులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది.
Advertisement
Advertisement