అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ‘తెలుగుదేశం పార్టీలో మోసపోయాం. ఇక ఆ పార్టీలో ఉండలేం. అందుకే రాజీనామా చేస్తున్నా. భవిష్యత్ ప్రణాళికను త్వరలో వెల్లడిస్తా’ అని ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మైనార్టీ నేత నదీమ్ అహ్మద్ అన్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్‌టీఆర్ సెక్యులర్ భావాలతో స్థాపిస్తే.. చంద్రబాబు దాన్ని మతతత్వ పార్టీలా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘చంద్రబాబు రాష్ర్ట వ్యాప్తంగా ముస్లింలకు తీరని అన్యాయం చేశారు. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి టీడీపీలో కొనసాగుతున్నా. ఏ నాడూ పార్టీ వీడుతానని అనుకోలేదు. పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదు.
పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని కొనసాగా. కానీ ఎన్నికల్లో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు నచ్చడం లేదు. ఎక్కడికి పోతున్నామో అంతు చిక్కడం లేదు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకుని చారిత్రక తప్పిదం చేశానని, భవిష్యత్‌లో మతతత్వ పార్టీలతో సంబంధాలు పెట్టుకోనని గతంలో అనంతపురంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సదస్సులో బాబు చెప్పారు. యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. బీసీలకు వంద సీట్లు అన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలకు 15 సీట్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎ టూ ఓడిపోయే పీలేరు సీటును ముస్లింలకు కేటాయించారు. జిల్లాకొక సీటు కేటాయిస్తానని అన్యా యం చేశారు. బాబు విధానాలపై మా వర్గానికి ఏం సమాధానం చెప్పుకోవాలి? బాలకృష్ణ పోటీ చేయాల్సి రావడంతో హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనికి అనంతపురం ఎంపీ సీటును, అనంతపురం ఎమ్మెల్యే సీటును నాకు కేటాయించాలని ముస్లింలంతా తీర్మానం చేశారు. కానీ ఆ తీర్మానాన్ని చంద్రబాబు చెవికెక్కించుకో లే దు. బీజేపీతోనే పోతాను.. ముస్లింలు ఉంటే ఉండ ని.. పోతే పోనీ.. అన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మైనార్టీలను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోండని చెప్పలేక బీజేపీతో పొత్తు పెట్టుకుని పొగబెట్టారు. ఇంతగా మోసపోయిన టీడీపీలో ఇక కొనసాగలేం. అందుకే రాజీమానా చేశా’ అని వివరించారు.
మోసం చేశారు..
Published Sun, Apr 27 2014 3:48 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement