నేడు చేవెళ్లలో కేసీఆర్ సభ | today kcr sabha in chevella | Sakshi
Sakshi News home page

నేడు చేవెళ్లలో కేసీఆర్ సభ

Published Fri, Apr 18 2014 11:22 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

నేడు చేవెళ్లలో కేసీఆర్  సభ - Sakshi

నేడు చేవెళ్లలో కేసీఆర్ సభ

 చేవెళ్ల, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేడు చేవెళ్లలో నిర్వహించే ఎన్నికల సభలో పాల్గొననున్నారు. శనివారం సాయంత్రం 5గంటలకు సభ ప్రారంభం కానుంది. సభ ఏర్పాట్లను చేవెళ్ల లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి కేఎస్ రత్నం పరిశీలించారు. కేసీఆర్ నగరం నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా చేవెళ్లకు చేరుకుంటారు.

స్థానిక ఇంద్రారెడ్డి స్మారక ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో నిర్వహించే బహిరంగసభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సభాస్థలికి కొద్ది దూరంలోని కొండా వెంకటరంగారెడ్డి మైదానంలో హెలిపాడ్ నిర్మాణపనులు చేపట్టారు. కేసీఆర్ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నందున భద్రతా ఏర్పాట్లను, సభ ప్రాంగణం, హెలిపాడ్ నిర్మాణ పనులను అడిషనల్ ఎస్పీ పీ. వెంకటస్వామి, చేవెళ్ల డీఎస్పీ సీహెచ్ శ్రీదర్, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ లక్ష్మీరెడ్డి పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement