తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ప్రాంతంలో బీసీ నేత ఆర్. కృష్ణయ్యను పార్టీ సీఎం అభ్యర్థిగా అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.
* ఆర్. కృష్ణయ్యకు సీనియార్టీ సమస్య
* రేసులో తలసాని, సాయన్న
* ఎర్రబెల్లి, సండ్రకు సామాజికవర్గం అడ్డంకి
* నేడు బాబుతో కొత్త ఎమ్మెల్యేల సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ప్రాంతంలో బీసీ నేత ఆర్. కృష్ణయ్యను పార్టీ సీఎం అభ్యర్థిగా అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున ఎల్‌బీనగర్ నుంచి పోటీ చేసిన కృష్ణయ్యతో పాటు 15 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా నెగ్గారు. వీరంతా కలిసి రేపో మాపో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాల్సి ఉం టుంది. నిజానికి పార్టీ సీఎం అభ్యర్థిగా చంద్రబాబు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఆర్. కృష్ణయ్యనే టీడీఎల్‌పీ నాయకుడిని చేయాలి.
అయితే ఎన్నికల ముందే పార్టీలో చేరి, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్. కృష్ణయ్యను ఇప్పుడు శాసనసభలో తమ నేతగా అంగీకరించేందుకు తాజాగా ఎమ్మెల్యేలైన సీనియర్ నేతలు సిద్ధంగా లేరు. కొత్తగా గెలిచిన తెలంగాణ ఎమ్మెల్యేలు శనివారం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశముంది. చంద్రబాబు ఎవరి పేరు చెబితే ఆయన్నే టీ-టీడీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశమున్నప్పటికీ సీనియర్లు మాత్రం తమ అభిప్రాయాలను అధినేతకు చెప్పనున్నట్లు సమాచారం. బీసీ నేతనే టీడీఎల్పీ నేతగా ఎన్నుకోవాలని భావిస్తే సనత్‌నగర్ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముందు వరుసలో నిలిచే అవకాశముంది.
ఆయనకు ఇది నాలుగో విజయం. అలాగే కంటోన్మెంట్ నుంచి నాలుగోసారి గెలిచిన సాయన్న కూడా అర్హుడే. విద్యావంతుడైన సాయన్న గతంలో టీడీఎల్పీ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి కూడా దక్కలేదు. ఎస్పీ వర్గానికి చెందిన ఆయనకు అవకాశమిస్తే సామాజిక సమతుల్యత విషయంలోనూ ఇబ్బం దులు ఉండవు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర పోటీలోనూ పాలకుర్తి నుంచి విజయం సాధించగా, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. అయితే వారి సామాజికవర్గమే వారికి అడ్డంకి కావచ్చు.