
మన చుట్టూ ఉండే ఔషధ మొక్కల ఆకులతో కషాయాలు తాగుతూ సిరిధాన్యాలు ప్రధాన ఆహారంగా తింటూ ఉంటే.. కరోనా వైరస్ వల్ల గాని, మరే ఇతర వైరస్‌ల వల్ల గాని సాంక్రమిక వ్యాధులు సోకుతాయన్న భయం లేకుండా మనుషులు జీవించవచ్చని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి చెబుతున్నారు. కరోనా వైరస్ నుంచి రక్షణకు రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ కింద పేర్కొన్న ఏడు రకాల ఔషధ మొక్కల ఆకులతో తయారు చేసిన కషాయం ఉదయం పరగడుపున, సాయంత్రం ఖాళీ కడుపున 14 రోజుల పాటు తాగాలని ఆయన సూచిస్తున్నారు. ఒక్కో రకం ఆకుతో రెండేసి రోజులు కషాయం తాగాలి.
1. గరిక (CYNADON DACTYLON)
2. తులసి (OCIMUM SANCTUM)
3. తిప్పతీగ (TINOSPORA CORDIFOLIA)
4. బిల్వం (AEGLE MARMELOS)
5. కానుగ (PONGAMIA PINNATA)
6. వేప (AZADIRACHTA INDICA)
7. రావి (FICUS RELIGIOSA)
గుప్పిటలో సరిపోయే అన్ని ఆకులను తీసుకొని గ్లాసుడు నీటిలో కేవలం 5 నిమిషాలు ఉడికించి, కాస్త బెల్లం లేదా తాటి బెల్లం కలుపుకొని గోరు వేచ్చగ గాని, చల్లారిన తర్వాత గాని తాగాలి. పైన పేర్కొన్న వరుసలోనే ఆయా కషాయాలను రెండేసి రోజుల చొప్పున తాగితే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ఆయన తెలిపారు. అవసరం అనుకుంటే మరో విడత 14 రోజుల పాటు ఈ 7 కషాయాలు తాగితే మంచిది.
కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే.. రుస్టాక్స్–200, బ్రయోనియా–200 హోమియో పిల్స్‌ను మూడేసి చొప్పున తీసుకొని అరకప్పు నీటిలో కలుపుకొని ఉదయం, సాయంత్రం మూడు రోజులు తాగితే రోగనిరోధక శక్తి వస్తుందని తెలిపారు.
ఒకవేళ కరోనా సోకితే. రోగం వచ్చిన తర్వాత తిప్పతీగ, తులసి, పారిజాతం కషాయాలను రోజుకు రెండు సార్లు తాగాలి. కరోనా సోకితే ఆర్సెనిక్ ఆల్బం, ఫాస్ఫరస్, బ్రయోనియా మందులు పనిచేస్తాయి. దగ్గరలోని హోమియో వైద్యుడ్ని సంప్రదించి మీకు ఏ మందు తగినదో నిర్ణయించుకొని వాడుకోవాలని డా.ఖాదర్ వలి సూచించారు. ‘ముఖ్యంగా ఈ రోగాలు మాంసాహారులకు రోగనిరోధక శక్తి దేహంలో తక్కువ ఉండటం వల్ల వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మన అదృష్టం కొద్దీ ప్రపంచంలో ఉన్న దేశాల్లో కంటే మన దేశం ఇంకా శాకాహార దేశమే అని చెప్పుకోవాలి. కానీ, ప్రస్తుతం ఆధునిక ఆహార పద్ధతుల్లో మనకు తెలియకుండానే మాంసాహార పదార్థాలు శాకాహారుల ఇళ్లలోకి కూడా ఆహారంలోకి వచ్చేస్తున్నాయి. అందువల్ల పూర్తిగా మనం ‘సిరి’జీవన విధానాన్ని మన జీవనక్రమంలోకి తెచ్చుకుంటే, శాకాహారులుగా ఉంటే, ఏ వైరాణువుల నుంచి వచ్చే సాంక్రమిక రోగానికీ భయపడాల్సిన అవసరం లేనేలేదు. కాబట్టి, మనందరం శాకాహారులుగా మారదాం. నిర్భీతిగా బతుకుదాం అంటున్నారు డా. ఖాదర్ వలి.