విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఈ నెల 23న పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది.
చైతన్యపురి (హైదరాబాద్): విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఈ నెల 23న పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఏబీవీపీ భాగ్యనగర్ శాఖ కార్యదర్శి. ఎల్‌బీనగర్ ఇంచార్జి పి.వెంకట్‌రెడ్డి ఆదివారం కొత్తపేటలోని అరబిందో డిగ్రీ కళాశాల ఆవరణతో ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లు కేజీ టు పీజీ ఉచిత విద్యను వెంటనే అమలులోకి తేవాలని, విద్యార్థుల తల్లిదండ్రులనుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తోన్న కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించాలని కోరారు.