అమిత్ షా ప్రకటనలన్నీ అబద్ధాలే: సీపీఐ | Amit Shah notices all are lies: CPI | Sakshi
Sakshi News home page

అమిత్ షా ప్రకటనలన్నీ అబద్ధాలే: సీపీఐ

Published Mon, Jun 13 2016 3:03 AM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

Amit Shah notices all are lies: CPI

సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కేంద్రం నుంచి రూ.90 వేల కోట్లు అందించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ప్రకటనలన్నీ పచ్చి అబద్ధాలేనని, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే రీతిన ఆయన మాట్లాడటం గర్హనీయమని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలో కరువు నివారణకు రూ.3,064 కోట్లు కావాలని అడిగితే కేంద్రం ఇచ్చింది రూ.712 కోట్లేనని గుర్తు చేశారు. కేంద్రానికి ఉదార స్వభావం ఉంటే రైతు ఆత్మహత్యలను ఆపేందుకు ప్రత్యేకంగా నిధులిచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement