వివక్షకు తావులేని సమాజం తెలంగాణలో ఉండాలని, దీనికోసం చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత కే.లక్ష్మన్ ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్: వివక్షకు తావులేని సమాజం తెలంగాణలో ఉండాలని, దీనికోసం చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత కే.లక్ష్మన్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దాదాపు 87 సంచార జాతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. వీరిలో 94 శాతం ప్రజలు పేదరికం దిగువ ఉన్నారని, ఈ తెగల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని లక్ష్మన్ తెలిపారు. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. వీరి అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. సంచార జాతుల అభివృద్ధి కోసం 5 కోట్ల ఫండ్ కెటాయించినట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు.