
ఏపీ సచివాలయంలో చంద్రబాబు
నెల్లూరులో జరిగిన విచ్చలవిడి కట్టడాల వల్లే ఇటీవలి కాలంలో ఆ పట్టణంలో వరద బీభత్సం సృష్టించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
హైదరాబాద్: నెల్లూరులో జరిగిన విచ్చలవిడి కట్టడాల వల్లే ఇటీవలి కాలంలో ఆ పట్టణంలో వరద బీభత్సం సృష్టించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దాదాపు మూడు నెలల తర్వాత హైదరాబాద్‌లోని సచివాలయానికి వచ్చిన ఆయన శనివారం ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు.
శాఖల వారిగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌పై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరయ్యారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ, నదుల అనుసంధానం, నీరు చెట్లు, భూ గర్భ జలాలను అభివృద్ధి చేయడం వల్ల మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. అనంతపురం జిల్లాలో ఈసారి ఊహించని విధంగా వర్షపాతం పెరిగిందని, భూ గర్బ జలాలు అందక రాయలసీమ రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారని చెబుతూ, 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. 3 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు.