నల్ల కుబేరుల జాబితా బయటపెట్టాలి: జూలకంటి
Published Tue, Nov 15 2016 5:10 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
హైదరాబాద్: నల్ల కుబేరుల జాబితాను బయటపెట్టాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ..బ్యాంక్ రుణాలను ఎగ్గొట్టిన వారే ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్నారన్నారు. నల్లధనం ప్రస్తుతం దేశంలో లేదని, విదేశాలకు తరలి వెళ్లిందన్నారు. 100 రోజుల్లో బ్లాక్‌మనీ తెస్తానన్న మోదీ ఆ విషయంలో విఫలమయ్యారని విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ రూ. 2 వేల నోట్లెందుకు తెచ్చారని అన్నారు. కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించాలన్నారు. నోట్ల రద్దు తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపించిందని, సర్కార్‌కు రెవెన్యూ తగ్గడంతో కేసీఆర్ నిద్ర పోవడం లేదన్నారు. ప్రజా ప్రతినిధులు జీతాలు తీసుకోవడం మానేసి..ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అవినీతి పరులపై మోదీ ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు.
Advertisement