సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా శాఖలో ప్రస్తుతం ఉన్న 56 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(డి ప్యూటీ ఈవో) పోస్టులు రద్దయ్యాయా? ఈ ప్రశ్నకు విద్యా శాఖ మౌఖి కంగా లేదని సమాధానం చెబుతోంది. ప్రభుత్వానికి ఇటీవల విద్యా శాఖ ఇచ్చిన నివేదికలో మాత్రం ఈ పోస్టులను చూపించలేదు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రతి జిల్లాకు ఓ డీఈవోను నియమించేందుకు చర్యలు చేపట్టింది. దీనికి ప్రస్తుతమున్న 11 మంది డిప్యూటీ ఈవోలను ఇన్‌చార్జి డీఈవోలుగా నియమిస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే ఇన్‌చార్జి డీఈవోలుగా వెళ్లిపోయాక ఖాళీ అయ్యే స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారన్న అంశాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.
వాటి భర్తీ ప్రస్తావన లేకుండానే కొత్త జిల్లాల్లో డీఈవో కార్యాలయాలు, విద్యా విభాగం వివరాలను పొందుపరిచింది. దీంతో ఆయా పోస్టులను రద్దు చేస్తోందన్న ఆందోళన ఉపాధ్యాయ వర్గా ల్లో నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12 డీఈవో పోస్టులుం డగా, కొత్తగా వచ్చే డిప్యూటీ ఈవోలు 11 మందిని కలిపి 23 పోస్టులవుతున్నాయి. మరో 4 పోస్టుల్లో ఏడీ లేదా డైట్ లెక్చరర్లను ఇన్‌చార్జి డీఈవోలుగా నియమించడం ద్వారా మొత్తం 27 జిల్లాలకు 27 మందిని డీఈవోలుగా నియమించనున్నట్లు తెలిసింది. మరోవైపు ఏజెన్సీ డీఈవో పోస్టులను రద్దు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఈ పోస్టులపై సందిగ్ధత నెలకొంది.
ఉపాధ్యాయ సంఘాలు ఈ పోస్టులను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో 467 మండల విద్యాధికారి పోస్టులుండగా, 44 మంది పనిచేస్తున్నారు. మిగతా పోస్టుల్లో సీనియర్ హెడ్‌మాస్టర్లను ఇన్‌చార్జి ఎంఈవోలుగా నియమిస్తామని నివేదికలో పేర్కొంది. డిప్యూటీ ఈవో పోస్టులను రద్దు చేయొ ద్దని, ప్రస్తుత పాఠశాలల సంఖ్య పెరిగినందున ఈ పోస్టులను జిల్లాకు ఒకటి నియమించాలని పీఆర్‌టీయూ- తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి కోరారు.
డిప్యూటీ ఈవో పోస్టులు ఉన్నట్టా..? లేనట్టా?
Published Fri, Sep 23 2016 1:02 AM | Last Updated on Mon, Jul 29 2019 6:06 PM
Advertisement
Advertisement