వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ ద్వారానే ర్యాంకులు నిర్ణయించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రావు చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ ద్వారానే ర్యాంకులు నిర్ణయించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రావు చెప్పారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు మాత్రమే ‘నీట్’తో సమస్య అని పేర్కొన్నారు. వాటిని మినహాయిస్తే బైపీసీ ఆధారంగా జరిగే ఇతర కోర్సుల కౌన్సెలింగ్‌కు గతంలో మాదిరిగానే హాజరుకావచ్చని చెప్పారు.
మెడికల్ ప్రవేశాలకు ‘నీట్’ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో దాని ప్రభావం తమపై ఉండబోదని.. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ సీట్లను ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తామని తెలిపారు. కాగా ఆయుష్‌లోని కోర్సులకు కూడా ఇదేవిధంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.