కాంగ్రెస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి | Greater development during the Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి

Published Fri, Jan 29 2016 12:33 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

కాంగ్రెస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి - Sakshi

కాంగ్రెస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
 
రామంతాపూర్: గ్రేటర్ హైదరాబాద్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం రామంతాపూర్ దూరదర్శన్ కేంద్రం నుంచి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో మెట్రో ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ హయాంలోనే చేపట్టినట్టు గుర్తు చేశారు. నగరానికి గోదావరి, కృష్ణా జలాలను తాము తీసుకొస్తే టీఆర్‌ఎస్ నాయకులు తెచ్చినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటని ఎద్దేవాచేశారు. గ్రేటర్ ఎన్నికలలో మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిదని... ఇంతవరకు ఆ విషయాన్నే ప్రస్తావించడం లేదని ఆయన విమర్శించారు. గ్రేటర్ ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ.. తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే నగరాభివృద్ధికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. రామంతాపూర్, హబ్సిగూడ డివిజన్ల అభ్యర్థులు సరిత, మంజులలను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీసీపీ అధ్యక్షులు క్యామ మల్లేశ్, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, బస్వరాజు సారయ్య, నర్సింహారావు, బండారు లక్ష్మారెడ్డి, లక్ష్మణ్‌గౌడ్, కంది ఆగిరెడ్డి, పసూల ప్రభాకర్‌రెడ్డి, నరేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement