బల్దియా పాత భవనాలు.. | history of old buildings in GHMC | Sakshi
Sakshi News home page

బల్దియా పాత భవనాలు..

Published Sat, Jan 9 2016 4:56 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

history of old buildings in GHMC

ఒకప్పుడు మన బల్దియా ప్రధాన కార్యాలయం పాత నగరంలోని దారుల్ షిఫాలో ఉండేది. ఈ భవనాలను నిర్మించి వందేళ్లు దాటింది. 1878లో కేవలం రాజవంశీయుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాల మదర్‌సా-ఐ-ఐజా ఇందులో ఉండేది. ఈ పాఠశాలను సర్ నిజామత్ జంగ్ ఏర్పాటు చేశాడు.

ఆ తర్వాత ఈ భవనాలను టంకసాలగా మార్చారు. ప్రస్తుతం విక్టోరియా  ఆస్పత్రి ఉన్న భవనంలో కొనసాగుతున్న మున్సిపల్ కార్యాలయాన్ని 1906లో దారుల్ షిఫాలోని ఈ భవనాలకు తరలించారు. ట్యాంక్‌బండ్ వద్ద నూతన భవనాలను నిర్మించిన
 అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి అందులోకి మార్చారు.

గతంలో టంకశాల ద్వారం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారానికి పక్కనే ఉండేది. పశ్చిమవైపన అజఖానా-జోహర వైపుగల భవన భాగం నూతనంగా నిర్మించారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కొనసాగిన ఈ భవనాల్లో ప్రస్తుతం కులీకుతుబ్ షా పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయం ఉండేది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement