బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా మరో రెండ్రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా మరో రెండ్రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు కరీంనగర్ జిల్లా సారంగాపూర్లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్లో 3, చేవెళ్ల, పినపాక, బాన్సువాడ, జుక్కల్, మద్నూర్, రామాయంపేట్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, నల్లగొండ, వికారాబాద్, నారాయణ్ఖేడ్, మెదక్, నవీపేట్లలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఉపరితల ద్రోణి కారణంగా హైదరాబాద్లో వాతావరణం చల్లబడింది. నగరంలో గరిష్టంగా 33.5 డిగ్రీలు, కనిష్టంగా 21.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది.
ఆదివారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
హన్మకొండ 40.5
రామగుండం 40.4
భద్రాచలం 37.2
ఖమ్మం 36.8
ఆదిలాబాద్ 34.8
నిజామాబాద్ 34.5
హైదరాబాద్ 33.5
మెదక్ 33.0