ఎమర్జెన్సీని తలపించేలా పాలన
టీఆర్‌ఎస్‌పై జూలకంటి ఫైర్
సాక్షి, హైదరాబాద్ : ఎమర్జెన్సీ రోజులను తలపించేలా టీఆర్‌ఎస్ పాలన సాగుతోందని సీపీఎం నేత జాలకంటి రంగారెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ వాటిని అణచేయడం సరికాదన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, విపక్ష పార్టీల నాయకులను గ్రామాలకు వెళ్లకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు.
సమస్యల్లో ఉన్న ప్రజలను పరామర్శించడానికి, స్వయంగా కలుసుకోడానికి విపక్ష నేతలు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పించడం గర్హనీయమన్నారు.