నయీమ్‌ను అంతమొందించడం మంచిదే
ఈ కేసులో ప్రభుత్వ పనితీరు బాగుందని జానారెడ్డి ప్రశంస
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగుందని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో తనను కలసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ నయీమ్‌ను అంతమొందించడంలో ప్రభుత్వ నిర్ణయం సరైందేనని మెచ్చుకున్నారు. నయీమ్ ఆగడాలను గత ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలమైందనడం సరికాదన్నారు.
కాగా, నయీమ్ తనను ఎప్పుడూ బెదిరించలేదని జానారెడ్డి చెప్పారు. ఈ కేసుపై సిట్‌ను ఏర్పాటు చేయవద్దనడం సరికాదన్నారు. సిట్ నివేదిక వచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తు అవసరమా, వద్దా అనేది చెబుతామన్నారు. కాంగ్రెస్ ‘జలదృశ్యం’ ప్రజెంటేషన్ సమయంలో తాను కర్ణాటక వెళ్లానని జానారెడ్డి చెప్పారు.