► నిబంధనలకు అనుగుణంగా లేవన్న స్పీకర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన 13 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వే టు వేయాల్సిందిగా వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్లను సభాపతి కోడెల శివప్రసాదరావు శనివారం డిస్మిస్ చేశారు. నిబంధనలకు అనుగుణంగా లేవనే కారణంతో వాటిని డిస్మిస్ చేసినట్లు ఆయన వెల్లడిం చారు. భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, పాలపర్తి డేవిడ్ రాజు, జలీల్‌ఖాన్, తిరివీధి జయరామయ్య, ఎం. మణిగాంధీ, కలమట వెంకట రమణ మూర్తి, పాశం సునీల్‌కుమార్, జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, సి ఆదినారాయణరెడ్డి తదితరులు పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాల్సిందిగా వైఎస్సార్‌సీపీ ఎల్పీ విప్ ఎన్.అమర్‌నాథరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. (అమర్‌నాథరెడ్డి ఇటీవలనే టీడీపీలో చేరారు) సుజయకృష్ణ రంగారావు, అత్తార్ చాంద్ బాషాలపై కూడా ఇవే చర్యలు తీసుకోవాల్సిందిగా మహ్మద్ ముస్తఫా షేక్ మరో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్లు పరిశీలించిన తరువాత తాను ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు శనివారం అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ చెప్పారు. తన ఉత్తర్వుల్లోని సారాం శాన్ని ఆయన చదివి వినిపించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని ఆర్టికల్ 191(2)లోని పేరా 2(1), 1986లో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ(ఫిరాయింపుల వల్ల అనర్హత) నిబంధన ఆరు (6,7)కు అనుగుణంగా లేకపోవటంతో పిటిషన్లను తిరస్కరించినట్లు పేర్కొన్నారు.
‘ఫిరాయింపు’ పిటిషన్లు డిస్మిస్
Published Sun, Jul 3 2016 3:34 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement