సికింద్రాబాద్ మోండా మార్కెట్లో నడి రోడ్డుపై సోమవారం ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు
హైదరాబాద్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్లో నడి రోడ్డుపై సోమవారం ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జ్యోతి కాలనీకి చెందిన వెంకటేష్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కోర్టులో అటెండర్గా పని చేస్తున్నాడు. ఏం జరిగిందో ఏమో కాని ఈ రోజు ఉదయం ..సికింద్రాబాద్ కింగ్ దర్బర్ హోటల్ వద్దకు వచ్చిన అతను వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. విషయం గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. అతనిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.