
'వినాయక చతుర్థి సందర్భంగా జంతువధ నిషేధం'
వినాయకచవితి, బక్రీదుల సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో జంతువధను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌బొజ్జా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కలెక్టరేట్ (హైదరాబాద్): వినాయకచవితి, బక్రీదుల సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో జంతువధను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌బొజ్జా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్లాటర్ హౌస్‌ల నిర్వాహకులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు వహించి అధికారులకు సహకరించాలని కోరారు. జంతువులను, పక్షులను ప్రార్థన స్థలాల్లో, జన సముదాయాల్లో ప్రదర్శించడం, పండుగ రోజుల్లో బలి ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు. వినాయకచవితి ఉత్సవాలు సెప్టెంబరు 17 నుంచి 27 వరకు నిర్వహిస్తామని.. సెప్టెంబరు 24న బక్రీద్ పండుగ వస్తున్నందున సంబంధిత అధికారులు మందస్తు నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు.