రణబీర్‌కు రెడ్ సిగ్నల్! | Ranbir Kapoor cannot meet girlfriend Katrina Kaif, why? | Sakshi
Sakshi News home page

రణబీర్‌కు రెడ్ సిగ్నల్!

Published Tue, Jan 27 2015 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

రణబీర్‌కు రెడ్ సిగ్నల్!

రణబీర్‌కు రెడ్ సిగ్నల్!

బాలీవుడ్ ప్రేమికులు రణబీర్‌కపూర్, కత్రినాకైఫ్‌ల మధ్య రెడ్ సిగ్నల్ వేశాడు దర్శకుడు అభిషేక్ కపూర్! ఒకరికొకరుగా తపిస్తున్న వారి కలయికకు బ్రేక్ వేశాడు. కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకోనున్న తన సినిమా ‘ఫితూర్’ సెట్స్ వద్దకు రణబీర్ రాకూడదంటూ కండిషన్ పెట్టాడట.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం ఈ చిన్నది కశ్మీర్ వెళుతోంది. షెడ్యూల్ ప్రకారం పక్కాగా పని ముగించుకోవాలన్న పట్టుదలతో ఉన్న అభిషేక్... ‘దయచేసి మీరు కశ్మీర్‌కు రావద్దు’ అంటూ రణబీర్‌కపూర్‌ను రిక్వెస్ట్ చేశాడని ఓ వెబ్‌సైట్ కథనం. ఇద్దరూ కలిస్తే... వారి ప్రేమాయణంలో పడి షూటింగ్‌కు బ్రేక్ వస్తుందనేది మనోడి అభిప్రాయమట! హూ...! ఎవడి గోల వాడిదంటే ఇదేనేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement