సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో గదుల కేటాయింపు విషయంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల మధ్య గురువారం స్వల్ప వాగ్వాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు ఎల్-బ్లాక్ కేటాయించిన విషయం విదితమే. ఎల్-బ్లాక్‌లో నాలుగో అంతస్తులో ప్రస్తుతం తెలంగాణ ఇంధన వనరుల విభాగం ఉంది. తమకు కేటాయించిన గదులను ఖాళీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తెలంగాణ వారిని అడిగారు.
తమకు కేటాయించిన డి-బ్లాక్ గదుల్లో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఖాళీ చేయడం లేదని, వారక్కడ ఖాళీ చేస్తే వెళ్లిపోతామని తెలంగాణ ఉద్యోగులు చెప్పారు. దీంతో ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. విభజన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు సంయమనం పాటించాలని, తమ రాజధాని ప్రకటించిన తర్వాత హైదరాబాద్ విడిచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు.
గదుల విషయంలో సచివాలయ ఉద్యోగుల వాగ్వాదం
Published Fri, Jun 27 2014 12:32 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement