
తెలుగు రాష్ట్రాలో రేపు వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమాలు
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమాలు శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు.
హైదరాబాద్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమాలు శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. అలాగే వైఎస్ఆర్ కుటుంబసభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. మరోవైపు హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు.