ఆ గ్రామాల సరిహద్దులపై సర్వే చేయండి | To survey that border villages | Sakshi
Sakshi News home page

ఆ గ్రామాల సరిహద్దులపై సర్వే చేయండి

Published Sat, Jun 18 2016 2:51 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

ఆ గ్రామాల సరిహద్దులపై సర్వే చేయండి - Sakshi

ఆ గ్రామాల సరిహద్దులపై సర్వే చేయండి

కృష్ణా, ఖమ్మం కలెక్టర్లకు హైకోర్టు ఆదేశం

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లాలోని నరికంపాడు, తెలంగాణలోని ఖమ్మం జిల్లా గుంటుపల్లి గోపవరం గ్రామాల మధ్య ఏర్పడిన సరిహద్దు వివాదం విషయంలో సర్వే నిర్వహించి, హద్దులను ఖరారు చేయాలని హైకోర్టు శుక్రవారం ఉభయ జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

నరికంపాడు గ్రామంలో తన భూమిలో యూకలిప్టస్ మొక్కలు నాటి, ఆ భూమిని తెలంగాణ అటవీభూమిగా చెబుతున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ బి.రోజా, మరో ఆరుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement