సనత్‌నగర్-భరత్‌నగర్ రైల్వేస్టేషన్ల మధ్య మెట్రో రైలు పనుల దృష్ట్యా శనివారం ఆ మార్గంలో నడిచే 20 ఎంఎంటీఎస్ రైళ్లను
సిటీబ్యూరో: సనత్‌నగర్-భరత్‌నగర్ రైల్వేస్టేషన్ల మధ్య మెట్రో రైలు పనుల దృష్ట్యా శనివారం ఆ మార్గంలో నడిచే 20 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు వీటి రాకపోకలు నిలిచిపోతాయి. లింగంపల్లి-ఫలక్‌నుమా, నాంపల్లి- లింగంపల్లి మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి.
వికారాబాద్-కాచిగూడ ప్యాసింజర్, తాండూరు-నాంపల్లి ప్యాసింజర్, సికింద్రాబాద్-వికారాబాద్ రైళ్లు రద్దు కానున్నాయి. ఫలక్‌నుమా-నాంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను సికింద్రాబాద్ వరకే పరిమితం చేస్తారు. పూనే-సికింద్రాబాద్ (12025/12026) శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి వరకు వచ్చి... తిరిగి అక్కడి నుంచే బయలుదేరుతుంది. వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 1.45 గంటలకు బదులు 2.30కి వికారాబాద్ నుంచి బయలుదేరుతుంది.