ధ్వజమెత్తిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయని, వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. రైతులకు ఏమీ చేయడంలేదని, ప్రాజెక్టులు కట్టడంలేదని విమర్శించిన ఏఐసీసీ నేత దిగ్విజయ్‌సింగ్‌పై వారు ధ్వజమెత్తారు. శనివారం ఇక్కడ టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు వి.గంగాధర్‌గౌడ్, ఫారుక్ హుస్సేన్‌లు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఇదే రీతిలో మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ప్రజల చీత్కారాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
దిగ్విజయ్ అప్పుడప్పుడూ తెలంగాణకు వస్తూ అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. కుటుంబ పార్టీలో ఉంటూ కేసీఆర్‌ది కుటుంబ పాలన అని ఆయన అనడం హాస్యాస్పదమన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు జీవో ఇచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఉద్యోగాలివ్వలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, ఎన్ని ఉద్యోగాలిచ్చామో ఆ వివరాలను కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి, గాంధీభవన్‌కు పంపుతామని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయి
Published Sun, Mar 5 2017 2:25 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement