CoronaVirus Total Positive Cases Till Today, Worldwide | Corona Telugu News - Sakshi
Sakshi News home page

26 లక్షలకి చేరువలో కరోనా పాజిటివ్‌ కేసులు

Published Wed, Apr 22 2020 3:15 PM | Last Updated on Wed, Apr 22 2020 4:11 PM

26 lakhs Corona cases registered world wide - Sakshi

న్యూయార్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 26 లక్షలకు చేరువైంది. కరోనా కారణంగా లక్షా 78 వేల మందికి పైగా మృతి చెందగా, 7 లక్షల మందికిపైగా కోలుకున్నారు. కరోనాతో కోలుకున్న వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. (ఏపీలో కొత్తగా 56 పాజిటివ్‌ కేసులు)

అమెరికాలో బాధితుల సంఖ్య 8 లక్షలు దాటిపోగా, 45 వేలకు పైగా చనిపోయారు. అలాగే స్పెయిన్‌లో కరోనా బాధితులు 2లక్షల పైనే ఉండగా, 21 వేల 282 మంది మృతి చెందారు. ఇటలీలో 1 లక్షా 83 వేల 957 మంది కరోనా వైరస్ బారిన పడగా, 24,648 మంది చనిపోయారు. అలాగే ఫ్రాన్స్ , జర్మనీ , యూకేలో కూడా కరోనా విజృంభిస్తోంది.(భారత్‌లో 19,984 పాటిజివ్ కేసులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement