చిక్కుల్లో గూగుల్ యాజమాన్యం | Google Antitrust Investigations Spread Across the Globe | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో గూగుల్ యాజమాన్యం

Published Wed, Sep 2 2015 10:25 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

చిక్కుల్లో గూగుల్ యాజమాన్యం

చిక్కుల్లో గూగుల్ యాజమాన్యం

శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్ సంస్థ తమ కంపెనీల విషయాలను తక్కువ చేసి చూపుతుందని అమెరికా, యూరప్ ఖండాలలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. అదేవిధంగా భారత్ లో కూడా ఈ సమస్యలు తలెత్తుతున్నాయిని పలు కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చెందిన నిఘా విభాగం ఆ సంస్థ తీరుపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తడంతో పాటు వివరణ కోరింది. కంపెనీల మధ్య నెలకొన్న కాంపిటీషన్ వల్ల  ఈ సమస్యలు వస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. కంపెనీల ఆర్థిక లావాదేవిలు, ఆన్ లైన్ ప్రకటనల ర్యాంకింగ్స్, సేవల వివరాలను గూగుల్ సెర్చ్ ఇంజన్ తప్పుగా చూపిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బ్రెజిల్, మెక్సికోలలో సొంత కంపెనీల సేవలను ఎక్కువ చేసి చూపిస్తూ ఇతర కంపెనీల మార్కెట్లను దెబ్బతీస్తుందని స్థానిక వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. ఇదేతరహాలో భారత వెబ్ సైట్ భారత్ మాట్రిమోని, కన్స్యూమర్ అండ్ ట్రస్ట్ సొసైటీలు కూడా అవాస్తవాలను ప్రచారం చేయడంతో తమ సైట్ల సేవలు కాస్త నెమ్మదించాయని, ప్రజలలో అపనమ్మకాలు పెరిగే అవకాశాలు లేకపోలేదని ఆరోపిస్తున్నాయి. సెప్టెంబర్ 10 లోపు వివరణ ఇచ్చుకోవాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, గూగుల్ సంస్థ నిర్వాహకులకు సూచించగా, గడువును మరింత పొడిగించాలని గూగుల్ కోరుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement