ఈసారి ఐసిస్‌ టార్గెట్‌ బ్రిటీష్‌ నగరాలే! | Islamic State planning attacks in Britain | Sakshi
Sakshi News home page

ఈసారి ఐసిస్‌ టార్గెట్‌ బ్రిటీష్‌ నగరాలే!

Published Wed, Mar 1 2017 4:02 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM

ఈసారి ఐసిస్‌ టార్గెట్‌ బ్రిటీష్‌ నగరాలే!

ఈసారి ఐసిస్‌ టార్గెట్‌ బ్రిటీష్‌ నగరాలే!

లండన్‌: గత కొద్ది రోజులుగా చప్పుడు చేయకుండా ఉన్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ వాస్తవానికి పెద్ద మొత్తంలో కుట్రలు చేస్తున్నట్లు తెలిసింది. దాని దాడి వ్యూహాల్లో మార్పులు చేసుకొని కొత్త తరహాలో విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నిందట. అయితే, ఆ కొత్త తరహా దాడికి తొలుత బ్రిటన్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేసే ఓ సంస్థకు చెందిన న్యాయవాది మ్యాక్స్‌ హిల్‌ ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఈ షాకింగ్‌ విషయం చెప్పారు.

‘ఏమాత్రం విభేదాలు చూపకుండా విచక్షణారహితంగా అమాయక ప్రజలను ఇస్లామిక్‌ స్టేట్‌ లక్ష్యంగా చేసుకుంది. 40 ఏళ్ల కిందట బ్రిటన్‌ ఎదుర్కొన్న దాడి అంత పరిమాణంలో ఈసారి ఎటాక్‌ చేయాలని సిద్ధమవుతోంది. ఈ దాడి ఎలా ఉండబోతుందన్నది సహజంగా ఊహించడం కష్టం. బ్రిటన్‌లోని కొన్ని నగరాల్లో జాతి పరంగా, రంగు పరంగా దాడులు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. నిర్లక్ష్యం చేయడం అంతమంచిది కాదు. అదే సమయంలో బ్రిటన్‌ సైనిక బలం, ఇంటెలిజెన్స్‌ ఈ దాడులను సమర్థంగా తిప్పిగొట్టగలుగుతుంది’  అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement