
నికరాగువాలో పుతిన్ ఆకస్మిక పర్యటన
మనాగువా: పశ్చిమ దేశాలతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో లాటిన్ అమెరికా దేశాల్లో తన ప్రాబల్యం తిరిగి పెంచుకునేందుకు రష్స సన్నద్ధమైంది. మిత్రదేశమైన క్యూబాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ నికరాగువాలో ఆకస్మిక పర్యటన జరిపారు. లాటిన్ అమెరికాలో తలపెట్టిన ఆరురోజుల పర్యటనలో భాగంగా పుతిన్ అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలనూ చుట్టిరానున్నారు. బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ దేశాల కూటమి సదస్సుకు హాజరుకానున్నారు.