త్వరలో సోలార్ టాయిలెట్లు!
నీటిచుక్క కూడా అవసరం లేకుండా సూర్యరశ్మితో పనిచేసే కొత్త రకం టాయిలెట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలోనే ఇలాంటి పర్యావరణహిత టాయిలెట్లను రూపొందించడం ఇదే మొదటిసారి. వచ్చేనెలలో మన దేశంలోనే వీటిని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థికసహాయం అందించింది. దీనికి కొలెరెడొ యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్ల్‌లిండన్ నేతృత్వం వహించారు. ఈ టాయిలెట్‌ను రోజుకు ఆరుగురు ఉపయోగించుకోవచ్చు. సూర్యరశ్మి ఆధారంగా పనిచేసే ఇది మానవవ్యర్థాలను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి బొగ్గుగా మారుస్తుంది. ఈ బొగ్గును కార్బన్‌డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపునకు, పంట దిగుబడి పెరుగుదలకు ఉపయోగించుకోవచ్చని ప్రొఫెసర్ కార్ల్‌లిండన్ తెలిపారు.