'టాప్ లెస్ సెల్పీ' మహిళా పోలీసుకు ఆఫర్లే ఆఫర్లు! | Topless selfie cop Nidia Garcia swamped with modelling offers after racy photos send temperatures soaring | Sakshi
Sakshi News home page

'టాప్ లెస్ సెల్పీ' మహిళా పోలీసుకు ఆఫర్లే ఆఫర్లు!

Published Mon, Apr 25 2016 11:35 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

'టాప్ లెస్ సెల్పీ' మహిళా పోలీసుకు ఆఫర్లే ఆఫర్లు!

'టాప్ లెస్ సెల్పీ' మహిళా పోలీసుకు ఆఫర్లే ఆఫర్లు!

ఓ మహిళా పోలీసు అధికారి టాప్ లెస్ గా దిగిన ఫోటో తన ఉద్యోగానికే ఎసరు తెస్తే.. మరోవైపు అదే ఫోటోను చూసిన మోడలింగ్ ఏజెన్సీలు తమ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలంటూ ఆఫర్లు మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి. వివరాలు.. మెక్సికోలోని ఎస్కోబెడోలో పెట్రోలింగ్ చేస్తున్న కారులో నిదియా గార్సియా ఆనే మహిళ పోలీసు టాప్ లెస్ సెల్ఫీ తీసుకుంది. తన యూనిఫాం ను కిందికు దించి రొమ్ము భాగం కనబడేలా సెల్ఫీ దిగింది. అంతేకాకుండా ఆ ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు  విచారణకు ఆదేశించారు. యూనిఫాంలో ఉండటమే కాకుండా ఆయుధాలను కూడా పక్కనే ఉంచి ఇలా చేసినందుకు అధికారులు అమెను సస్పెండ్ చేశారు. అలా చేసినందుకు తనను తానే అసహ్యించుకుంటున్నానని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నిదియా తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. తన ఇద్దరు కూతుళ్లు, భర్త,  తల్లిదండ్రులు, సోదరులకు చెడ్డ పేరు తీసుకు వచ్చానని వాపోయిన విషయం తెలిసిందే.

మరో వైపు నిదియా గార్సియా టాప్ లెస్ సెల్పీ చూసిన మోడలింగ్ ఏజెన్సీలు భారీ ఆఫర్లతో ముందుకు వచ్చాయి. తాము నిర్వహించే ఫోటో షూట్లలో న్యూడ్గా కాకుండా ప్రొఫెషనల్గా మాత్రమే ఉంటాయని నిదియాకు ఆఫర్ ఇచ్చిన స్థానిక మోడలింగ్ సంస్థ సీఈఓ ఒకరు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement