గే ముద్దులే ఘన నివాళి.. | TwoMenKissing spreads love in support of Orlando shooting victims | Sakshi
Sakshi News home page

గే ముద్దులే ఘన నివాళి..

Published Tue, Jun 14 2016 1:27 PM | Last Updated on Sat, Aug 25 2018 5:29 PM

TwoMenKissing spreads love in support of Orlando shooting victims


ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లెండోలోని పల్స్ గే నైట్ క్లబ్ లో ఆదివారం చోటుచేసుకున్న కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 49 మందిని పోలీసులు గుర్తించారు. పరిమిత వైశాల్యంలోని ఓ గదిలో పార్టీ చేసుకుంటున్న 300 మందిపై దుండగుడు మతిన్ ఒక్కసారిగా కాల్పులకు తెగబ్డ సంగతి తెలిసిందే. దుండగుణ్ని మట్టుపెట్టిన అనంతరం లోపలికి వెళ్లిన పోలీసులు అక్కడి దృశ్యాలు చూసి గగుర్పాటుకు గురయ్యారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్లో కొందరి ముఖాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. మృతదేహాలను ఆసుపత్రికి చేర్చిన పోలీసులు వాటిని గుర్తించే ప్రక్రియను సోమవారానికి పూర్తిచేశారు. చనిపోయిన వారిలో విద్యార్థులు, నర్సులు, డ్యాన్సర్లు, పెళ్లయినవాళ్లు తదితరులున్నట్లు ఆర్లెండో పోలీసులు తెలిపారు. కాగా, చనిపోయిన 49 మంది గే నైట్ క్లబ్ సభ్యులకు.. మగ- మగ ముద్దుల ఫొటోల ద్వారా నెటిజన్లు ఘన నివాళులు అర్పించారు. 
'మగ- మగ ముద్దులు పెట్టుకోవడం చూడలేకే నా కొడుకు ఈ పని చేసి ఉంటాడు' ఆర్లెండో నరమేధం అనంతరం దుండగుడు ఒమర్ మతిన్ తండ్రి చేసిన వ్యాఖ్య. సమాజంలోని పలు వర్గాలు ఆయన వ్యాఖ్యలను ఖండించగా, ఎల్జీబీటీలు మాత్రం తీవ్ర స్థాయిలో స్పందించారు. 'నైట్ క్లబ్ లో ప్రాణాలు కోల్పోయిన 49 మంది సహోదరులకు ఇదే మా ఘన నివాళి' అంటూ సోషల్ మీడియాలో మగ- మగ ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలను పెద్ద ఎత్తున పోస్ట్ చేశారు. సోమవారం ట్విట్టర్ లో  #TwoMenKissing విపరీతంగా ట్రేడ్ అయింది. ఒకేసారి దాదాపు 1000 మంది #TwoMenKissing లో చర్చించుకుని ఫేస్ బుక్ చర్చల రికార్డును బద్దలు కొట్టారు. తమ గే పార్ట్ నర్ ను ముద్దు పెట్టుకుంటూ ఫొటోలు పెట్టినవారిలో ప్రముఖుల దగ్గర్నుంచి సామాన్యుల వరకు ఉన్నారు.
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement