
సాక్షి, బెంగళూరు : దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా భావించిన ప్రధాన పార్టీలు ప్రచారాలతో హోరెత్తించాయి. దేశ ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా జాతీయ నేతలంతా కన్నడ నాట పర్యటించి జోరుగా ప్రచారం నిర్వహించారు. తమ పార్టీలకే ఓటు వేయాలని పదేపదే పిలుపునిచ్చారు.
వారి పిలుపులకు ప్రజలతోపాటు, ఓ పాము కూడా స్పందించినట్టు కనిపిస్తోంది. తాను కూడా ఓటు వేద్దామనుకుందో ఏమో.. కేఆర్‌పురం నియోజక వర్గంలోని కితానగర్ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించింది. అప్పటికే ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ప్రజలు.. ఆ అనుకోని అతిథిని చూసి బెంబేలెత్తిపోయారు. పాము..పాము అంటూ ఓటర్లు భయంతో పరుగులు తీశారు. దీంతో పోలింగ్ బూత్ వద్ద కాసేపు గందర గోళం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment