5 Things to do During 21 Day Lock-down Time | CoronaVirus | Telugu - Sakshi
Sakshi News home page

ఇంట్లో ఉంటూ ఇవి చేయండి!

Published Thu, Mar 26 2020 4:50 PM | Last Updated on Thu, Mar 26 2020 6:47 PM

 Stay Active During  21 Days Lockdown With Tips Shared By WHO - Sakshi

చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, పేదల నుంచి సంపన్నుల వరుకు, సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ ఇంటికే పరిమితమయ్యేలా చేసింది కరోనా మహమ్మారి. ప్రపంచంలోని అన్ని దేశాలను ఈ వైరస్‌ వణికిస్తున్న నేపథ్యంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ ను ప్రకటించాయి. దీంతో ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. భారత్‌లో ఈ లాక్‌డౌన్‌ 21 రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఈ అవకాశాన్ని ‘మేం ఫిట్‌గా తయారవ్వాలి’ అని అనుకునే వారు చక్కగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

రోజూ వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు ఏ పార్క్‌కో, జిమ్‌కో, ఫిట్‌నెస్‌ సెంటర్‌కో వెళతారు అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఇవేవి ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే లాక్‌డౌన్‌ కాలంలో ఇంట్లో ఉంటూనే వ్యాయామాలు చేస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పెద్దవారు కనీసం రోజుకు అరగంటసేపు వ్యాయామం చేయాలని సూచించింది. ఒక గంటపాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటారని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతగా నిద్రపోవడానికి కూడా వ్యాయామాలు దోహద పడతాయని పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్న వారు మధ్యలో బ్రేక్‌ ఇస్తూ అప్పుడప్పుడు లేచి నిలుచోవాలని, బాడీని స్ట్రచ్‌ చేయాలని తెలిపింది. వర్క్‌ ఫ్రం హోం చేసేవారు సరైనా పద్దతిలో కూర్చోని  పని చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ నేపథ్యంలో ఇంటివద్ద నుంచే వ్యాయామం చేయడానికి ఉన్న కొన్ని మార్గాలు ఒకసారి పరిశీలిద్దాం. 

1. యూట్యూబ్‌, టీవీల్లో వ్యాయామ కార్యక్రమాలు చూడటం: ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా పెరగడంతో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. గూగుల్‌లో దొరికిన విషయం అంటూ ఉండదు. ఇక వ్యాయామానికి సంబంధించి అయితే యూ ట్యూబ్‌లో కుప్పలు తెప్పలుగా వీడియోలు ఉన్నాయి. మరీ ఇంట్లోనే ఉండి ఫిట్‌నెస్‌ పొందాలి అనుకునే వారు ఈ వీడియోలు చూస్తూ వ్యాయామం చేయవచ్చు. ప్రస్తుతం మనలో స్ఫూర్తి నింపడానికి చాలా మంది ఫిట్‌నెస్‌ ట్రైనర్‌లు కూడా అనేక వీడియోలను ఇప్పుడ షేర్‌ చేస్తన్నారు.  ఎప్పటి నుంచో మీరు ఫిట్‌గా ఉండటానికి చేసే ప్రయత్నాలను వాయిదా వేస్తూ ఉంటే ఈ లాక్‌డౌన్‌ కాలాన్ని చక్కగా ఉపయోగించుకోండి.  

2. డాన్స్‌ చేయండి: కేలరీలను కరిగించుకోవడానికి మరో చక్కని మార్గం డాన్స్‌ చేయడం. ఇంట్లో ఉంటూనే మీకు ఇష్టమైన పాటలు పెట్టుకుంటూ డాన్స్‌ చేయండి. దీని వల్ల మీకు ఆనందంతో పాటు మీ శరీరంలో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. మానసిక ఉల్లాసంతో పాటు ఫిట్‌నెస్‌ లభిస్తుంది. 


 
3. యాక్టివ్‌ వీడియో గేమ్‌లు ఆడటం: ఆటలు శరీరానికి మంచి వ్యాయామం. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో బయట తిరగలేం కాబట్టి యాక్టివ్‌ వీడియో గేమ్స్‌ ఆడుకుంటూ మనల్ని మనం యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఇలాంటి ఆడటం వల్ల ఫిజికల్‌ యాక్టివిటి జరుగుతుంది. దీంతో కేలరీలు కూడా కరుగుతాయి. మీరు మీకిష్టమైన ఆటలాడుతూ వ్యాయామం కూడా ఒకేసారి చేయవచ్చు. 

4. స్కిప్పింగ్‌: ఇంట్లోనే ఉంటూ ఒక తాడుతో వ్యాయామం చెయ్యొచ్చు. స్కిప్పింగ్‌ రోప్‌తో ఎగురుతూ మీ ఇంటి టెర్రస్‌ పైనే వ్యాయామాన్ని చక్కగా పూర్తిచేయవచ్చు. అలాగే స్కిప్పింగ్‌ చేయడం వల్ల చాలా ఎక్కువ కేలరీలు ఖర్చుఅవుతాయి. ఇంట్లో ఉండి చేసే వ్యాయామాల్లో స్కిప్పింగ్‌ రోప్‌ను బెస్ట్‌ అని చెప్పవచ్చు. 

5. మజిల్‌ స్ట్రన్త్‌ ఎక్సర్‌ సైజ్‌లు: ఇంట్లో మీకు అందుబాటులో ఉండే వస్తువులతోనే మజిల్‌ స్ట్రన్త్‌ ఎక్సర్‌ సైజ్‌లు చేయడం ఉత్తమం. దీనివల్ల మీరు చాలా ఫిట్‌గా తయారవుతారు. ఇలాంటి వ్యాయామాలతోపాటు మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. లాక్‌డౌన్‌లో ఉన్న ఈ 21 రోజుల కాలాన్ని  మీ ఫిట్ నెస్‌ కోసం చక్కగా వినియోగించుకోండి. ఇంటి నుంచి బయటకు రాకుండా బాధ్యతయుత పౌరులు అనిపించుకోండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement