'శమంతకమణి' కోసం బాలయ్య | Balakrishna and Puri are the Shamantakamani Pre Release Event Guests | Sakshi
Sakshi News home page

'శమంతకమణి' కోసం బాలయ్య

Published Sun, Jul 2 2017 10:40 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

'శమంతకమణి' కోసం బాలయ్య - Sakshi

'శమంతకమణి' కోసం బాలయ్య

నలుగురు యంగ్ హీరోలు లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ సినిమా శమంతకమణి. భలేమంచి రోజు ఫేం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, ఆది, సందీప్ కిషన్, నారా రోహిత్లు లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్లు ముఖ్య అతిథిలుగా హాజరవుతున్నారు. కామెడీ క్రైం థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శమంతకమణి అనే ఖరీదైన రోల్స్ రాయిస్ కారు నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాను పది కోట్ల బడ్జెట్తో నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement