ధనుష్‌తో కాజల్ | Director confirms Dhanush, Kajal Aggarwal flick | Sakshi
Sakshi News home page

ధనుష్‌తో కాజల్

Published Mon, Jan 13 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

ధనుష్‌తో కాజల్

ధనుష్‌తో కాజల్

యువ నటుడు ధనుష్ అందాలభామ కాజల్ అగర్వాల్ జంటగా తెరమీద కనిపించబోతున్నారు. ఇది నిజంగా కొత్త కలయికనే కాదు క్రేజీ కాంబినేషన్ కూడా. ఈ జంటతో చిత్రం చేయడానికి యువ దర్శకుడు బాలాజి మోహన్ సన్నద్ధం అవుతున్నారు. సిద్ధార్థ్ హీరోగా కాదలిల్ సొదప్పవదు ఎప్పడీ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ దర్శకుడు తాజాగా వాయ్‌మూడి పేసవుం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
 
 షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. దర్శకుడు బాలాజీ మోహన్ తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యా రు. ఇందులో ధనుష్ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు ధృవపరిచారు. ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని ఆయన తెలిపారు. మరో విషయం ఏమిటంటే ధనుష్, కాజల్ పొల్లాదవన్ చిత్రం లోనే కలసి నటించాల్సింది. చివరి నిమిషంలో దివ్య స్పందన హీరోయిన్‌గా వచ్చి చేరింది. అయితే దీని తరువాత ధనుష్, కాజల్ జంటగా నటించనున్న చిత్రాన్ని సరికొత్త శైలిలో తెరకెక్కించనున్నట్లు బాలా జీ మోహన్ పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement