కబాలి టీజర్‌కు 54 లక్షల హిట్లు! | 'Kabali' teaser clocks over 5 million views in one day | Sakshi
Sakshi News home page

కబాలి టీజర్‌కు 54 లక్షల హిట్లు!

Published Mon, May 2 2016 1:59 PM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

కబాలి టీజర్‌కు 54 లక్షల హిట్లు!

కబాలి టీజర్‌కు 54 లక్షల హిట్లు!

లేటు వయసులో కూడా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఘాటుగా మాయ చేస్తున్నాడు. 65 ఏళ్ల వయసులో డాన్‌ పాత్రలో నటించడమే గొప్ప అనుకుంటే, తెల్లగెడ్డం పెట్టుకుని తిరుగులేని స్టైల్‌తో యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టించడం చూస్తుంటే రజనీ ఫీవర్ ఎంత ఉందన్నది అర్థమవుతోంది. తమిళంలో విడుదల చేసిన అఫీషియల్ టీజర్‌ను ఇప్పటివరకు దాదాపు 54 లక్షల మంది చూశారు. తెలుగు టీజర్ కూడా ఒక్క రోజులోనే 5.81 లక్షల వ్యూస్ సాధించింది. ''పాత తెలుగు చిత్రాల్లో ముఖం మీద గాటు పెట్టుకుని, లుంగీ కట్టుకుని.. కబాలి అనగానే రెండు చేతులు కట్టుకుని చెప్పండి బాబూ అని వంగి నమస్కారం చేస్తాడనుకున్నావా? ఈ కబాలి వేరు...'' అని కబాలి పాత్రలో రజనీకాంత్ ప్రత్యర్థికి కౌంటర్ ఇచ్చే ఈ టీజర్ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను ఓ ఊపు ఊపేసింది.

జాన్ లెనన్ కళ్లద్దాలు ధరించి, త్రీ పీస్ సూట్ వేసుకుని స్టైలుగా రజనీ నడిచి వస్తుంటే.. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో చూస్తున్నవాళ్లు కూడా విజిల్స్ వేయకుండా ఉండలేకపోతున్నారు. ఈ టీజర్ చివర్లో రజనీకాంత్ 1970ల నాటి సినిమాలో ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ.. తనదైన స్టైలులో జుట్టు వెనక్కి తోసుకుంటున్న బిట్ కూడా పెట్టారు. అప్పటికీ, ఇప్పటికీ రజనీ స్టైల్ ఏమాత్రం తగ్గలేదని చూపించడానికే ఈ బిట్ పెట్టినట్లు తెలుస్తోంది. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీ భార్యగా రాధికా ఆప్టే నటిస్తుండగా.. ఇతర పాత్రలలో కలైరసన్, దినేష్, రిత్విక తదితరులు నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement