భీమవరం.. బ్రహ్మాండం!
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతం చాలా ఆహ్లాదంగా ఉందని, త్వరలోనే ఈ ప్రాంతంలో షూటింగ్ చేస్తానని సినీతార కాజల్ అగర్వాల్ చెప్పింది. ఇక్కడ తనకు ఇంతమంది అభిమానులు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం హిందీలో ఒక సినిమాలో చేస్తున్నానని, త్వరలోనే తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తానని వివరించింది.
భీమవరంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన కాజల్ అగర్వాల్‌ను చూసేందుకు అభిమానులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. జిల్లా నలు మూలల నుంచి అభిమానులు రావడంతో జువ్వలపాలెం రోడ్డు కిక్కిరిసిపోయింది. ఆమె వాహనం దిగగానే.. 'మిత్రవిందా' అంటూ నినాదాలు చేశారు. ఆమెతో మాట్లాడేందుకు, చేతులు కలిపేందుకు ఆసక్తి చూపించారు.