ఆట తెచ్చిన మార్పు! | Kay Raja Kay release on 23rd | Sakshi
Sakshi News home page

ఆట తెచ్చిన మార్పు!

Published Sat, Apr 4 2015 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

ఆట తెచ్చిన మార్పు!

ఆట తెచ్చిన మార్పు!

ముగ్గురు కుర్రాళ్ల జీవితంలో కాయ్ రాజా కాయ్ ఆట ఎలాంటి మార్పులకు కారణమైంది? అనే కథాంశంతో మారుతి టాకీస్ సమర్పణలో ఫుల్‌మూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన చిత్రం ‘కాయ్ రాజా కాయ్’. రామ్ ఖన్నా, మానస్, షామిలి, శ్రావ్య ముఖ్య తారలుగా శివ గణేశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమకథ నేపథ్యంలో సాగే మాస్ ఎంటర్‌టైనర్ ఇది. జేబీ మంచి స్వరాలందించారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. శివ గణేశ్‌కిది తొలి చిత్రం అయినప్పటికీ బాగా తెరకెక్కించాడని మారుతి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement