ఆటతో మలుపు | "Kay Raja Kay" by Director Maruthi | Sakshi
Sakshi News home page

ఆటతో మలుపు

Published Mon, Jun 9 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

ఆటతో మలుపు

ఆటతో మలుపు

‘‘మారుతి సినిమా అంటే ఓ మార్క్ పడిపోయింది. కానీ, నా గత చిత్రాల తరహాలో కాకుండా సరికొత్త పంథాలో ఈ సినిమా ఉంటుంది. షూటింగ్ పూర్తయ్యింది. జేబీ మంచి స్వరాలిచ్చారు. త్వరలో పాటలను, వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని మారుతి చెప్పారు. శివగణేశ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ మారుతి టాకీస్, ఫుల్‌మూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కాయ్ రాజా కాయ్’. ఈ సినిమా ప్రచార చిత్రాలను సోమవారం సుమంత్ అశ్విన్ ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందజేశారు. శివగణేశ్ మాట్లాడుతూ -‘‘కాయ్ రాజా కాయ్ ఆట ఆడిన కొందరు యువకుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనేదే ఈ చిత్రకథ. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. రామ్ ఖన్నా, మానస్, శ్రావ్య, షామిలి ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీనివాస్ అడ్డాల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement